NTV Telugu Site icon

YV Subba Reddy: టీడీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయి..

Yv Subbareddy

Yv Subbareddy

YV Subba Reddy: అధికారంలోకి వచ్చిన మూడు నెలల నుంచి టీడీపీ నేతలు వైసీపీ వారిపై దాడులు చేస్తున్నారు అని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. అక్రమ కేసులు పెట్టి వైసీపీ నేతలను జైళ్లలో పెడుతున్నారు.. తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాం.. ప్రజల పక్షాన నిలబడతాం.. ఓ పక్క భారీ వర్షాలతో రాష్ట్రమంతా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.. విజయవాడ ప్రాంతంలో జరిగిన వరద నష్టాలను డైవర్ట్ చేసేందుకు టీడీపీ మా పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయిస్తోంది.. వరదలు, వర్షాల విషయంలో ప్రజల ఇబ్బందులు తీర్చటంలో ప్రభుత్వం విఫలమైంది అని ఆయన మండిపడ్డారు. అన్నీ కప్పిపుచ్చుకునేందుకే టీడీపీ ఈ పనులు చేస్తుంది.. టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం విషయంలో ఎవరి కుట్ర ఉన్నా ప్రభుత్వం విచారణ జరిపించి చర్యలు తీసుకోవచ్చు.. ప్రతీ దానికి వైసీపీ కుట్ర అంటూ నెపం వేయటం వారికి అలవాటైంది అని సుబ్బారెడ్డి అన్నారు.

Read Also: Constable Bribe: రూ. 20 లంచం తీసుకున్న కానిస్టేబుల్.. 34 ఏళ్ల తర్వాత అరెస్టుకు ఆదేశాలు..

ఇక, అధికారంలో ఉంది టీడీపీ.. ఏ విచారణలైనా చేయించవచ్చు అని రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. చంద్రబాబు ఇంటికి నీరు వెళ్లకుండా డైవర్ట్ చేయటం వల్లే బుడమేరుకు వరద.. నిందలు వేసే పనులు కాకుండా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి.. బాలినేని చంద్రబాబును కలవాలనుకోవటంలో తప్పేమి లేదు.. ప్రజా సమస్యలు వివరించటం కోసం ఎవరైనా సీఎంను కలవవచ్చు.. త్వరలో ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడి నియామకం చేపట్టే అవకాశం ఉందని అని సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

Show comments