ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీకి చెందిన ఓ నేత దారుణ హత్యకు గురయ్యాడు.. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వైఎస్సార్‌సీపీ నేత, గార మండల పరిషత్ ఉపాధ్యక్షుడు రామశేషును తెల్లవారుజామును హత్య చేశారు గుర్తుతెలియని వ్యక్తులు.. అయితే, గతంలోనూ అంటే 2017లోనూ రామశేషుపై హత్యాయత్నం జరిగిందని చెబుతున్నారు.. శ్రీకూర్మంలోని తన వ్యాపార గోడౌన్‌కు వెళ్తున్నప్పుడు మాటు వేసి గుర్తు తెలియని వ్యక్తులు.. దేశవాలి కత్తితో నరికి చంపారు.. శ్రీకూర్మం గ్యాస్ గోడౌన్ సమీపంలోనే ఈ హత్య జరిగింది.. పక్కనేఉన్న పొలాల్లో కత్తిని గుర్తించారు.. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యలో ముగ్గురు వ్యక్తులు పాల్గొనట్టు ప్రాథమికంగా గుర్తించారు.. అయితే, రామశేషు ఒంటిపై బంగారం అలాగే ఉంది.. సెల్‌ఫోన్‌ను కూడా వదిలేసి వెళ్లిపోయారు దుండగులు.. దీంతో, ఇది దొంగలపని కాదంటున్నారు.. అయితే, రియల్ ఎస్టేట్ వ్యవహారాలు, వివాహేతర సంబంధం కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టుగా చెబుతున్నారు.. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
Read Also: IT Raids : హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో పలు చోట్ల ఐటీ సోదాలు