టీడీపీ నేతలకు బెల్ట్ షాపులు ఉపాధి హామీ పథకం కింద మారాయని వైసీపీ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు విమర్శించారు. బెల్టు షాపులు పెడితే బెండు తీస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారని ఆయన అన్నారు. ఇప్పటి వరకూ ఎంతమంది బెండు తీశారో సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. బెల్టు షాపులు పెడితే బెండు తీస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారని .. మరి ఇప్పటివరకు ఎంత మంది బెండు తీశారో సమాధానం చెప్పాలన్నారు. ఇప్పటి వరకూ ఎన్ని కేసులు నమోదు చేశారో చెప్పాలని… ఎన్ని షాపుల లైసెన్సులు క్యాన్సిల్ చేశారో చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఎంతమందికి 5 లక్షల రూపాయలు జరిమానాలు విధించారన్నారు…
