Site icon NTV Telugu

RK Roja: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై ఆర్కే రోజా ఫైర్..

Roja

Roja

RK Roja: తెలంగాణ మంత్రి కొండా సురేఖ అక్కినేని నాగార్జున కుటుంబంపై ప్రత్యేకించి టాలీవుడ్ హీరోయిన్ సమంతపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నాను అని వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. ఇలాంటి జుగుష్టకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను అని చెప్పుకొచ్చారు. కొండా సురేఖ పై బీఆర్ఎస్ పార్టీ అనుయాయలు చేసిన పోస్టులను సమాజం తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ సందర్భంగా తీవ్ర వేదనకు గురి అయిన మంత్రి కొండ సురేఖ అంత కన్నా హేయమైన కామెంట్స్ ను తోటి మహిళపై చేయడానికి ఆ మనస్సు ఎలా అంగీకరించింది అని ఆర్కే రోజా ప్రశ్నించింది.

Read Also: Vinesh Phogat: వినేష్ ఫోగట్ సంచలన వ్యాఖ్యలు.. మోడీ ఫోన్ చేస్తే పట్టించుకోలేదని వ్యాఖ్య

మీకు మీ ప్రత్యర్థులకు ఉన్న రాజకీయ వివాదాల్లోకి సంబంధం లేని మహిళను తీసుకురావడం దుర్మార్గం ఆ పని మహిళే చేయటం మరింత బాధిస్తోంది అని మాజీమంత్రి ఆర్కే రోజా అన్నారు. ఇలాంటి వేదనాభరిత పరిస్థితి నుంచి అక్కినేని నాగార్జున కుటుంబం, నటి సమంత మనో ధైర్యంతో అదిగమిస్తుందని ఆశిస్తున్నాను అని ఆమె ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు.

Exit mobile version