Site icon NTV Telugu

BC Janardhan Reddy: వైసీపీ ప్రభుత్వ హయాంలో మన రోడ్లపై పక్క రాష్ట్రాలు జోకులు వేశాయి..

Bc Janardhan Reddy

Bc Janardhan Reddy

BC Janardhan Reddy: గతంలో మన రోడ్లను ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి చూశారు అని రోడ్లు భవనాలశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయంలో మన రోడ్లపై పక్క రాష్టాలు జోకులు కూడా వేశాయని పేర్కొన్నారు. మొత్తం రూ. 3, 014 కోట్లుతో పనులు చేస్తున్నాం.. రూ. 94 కోట్లు ఏలూరు జిల్లాకు కేటాయించాం అన్నారు. రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లే లక్ష్యంగా పని చేస్తున్నామని వెల్లడించారు. NDB రోడ్ల పనులను వచ్చే నెల చివరి నాటికి పూర్తి చేస్తామని మంత్రి జనార్థన్ రెడ్డి తెలియజేశారు.

Read Also: Pushpa 2 The Rule OTT: పుష్ప గాడు ఓటీటీలో దిగే టైం దగ్గర పడింది!

ఇక, నాణ్యత విషయంలో రాజీ పడకుండా పనులు చేస్తామని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు. 53 వేల కిలో మీటర్ల NDB రోడ్లు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అన్నారు. ఇప్పటి వరకు 65 శాతం పనులు పూర్తి అయ్యాయి.. 14-19 మధ్యలో మాత్రమే జరిగాయన్నారు. గత ప్రభుత్వ హయంలో రూ. 7, 334 కోట్లు మాత్రమే పనులు జరిగాయి.. రాష్ట్రంలో రూ. 1, 061 కోట్ల మరమత్తుల పనులు చేపట్టాం అని వెల్లడించారు. ఇప్పటి వరకు 65 శాతం పనులు పూర్తి చేశాం.. 12,200 కిలో మీటర్లు రోడ్లను పూర్తి చేశాం.. జంగిల్ క్లియరెన్స్ కూడా చేసి పనులు చేస్తున్నామని రోడ్లు భవనాలశాఖ మంత్రి జనార్దన్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Exit mobile version