Site icon NTV Telugu

టీడీపీ ఎజెండా ప్రకారమే బీజేపీ సభ.. సజ్జల కౌంటర్‌ ఎటాక్..

బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగ్రహ సభ, నేతలు చేసిన కామెంట్లపై సెటైర్లు వేశారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… టీడీపీ ఎజెండా ప్రకారమే బీజేపీ సభ నిర్వహించిందన్న ఆయన.. టీడీపీ, బీజేపీ, జనసేన… ఒకరు రాగం అందుకుంటే… మరొకరు పల్లవి అందుకుంటారు అంటూ సెటైర్లు వేశారు. ఎవరైనా ప్రజల సమస్యలపై మాట్లాడితే మేం సమాధానం ఇస్తాం.. కానీ, అలా కాకుండా వాళ్లే దేవాలయాలు కూలగొట్టేయటం, వాళ్లే ఆరోపణలు చేయటం రాజకీయమే అన్నారు.

రాష్ట్రంలో బీజేపీ ఉనికే తక్కువ.. చంద్రబాబు తన మనుషులను బీజేపీ, జనసేనలో పెట్టి తన ప్లాన్ అమలు చేస్తున్నారు అని మండిపడ్డారు సజ్జల… బీజేపీకి సొంత ఆలోచన లేదు.. మహా అయితే మతం గురించి మాత్రమే మాట్లాడుతుందని సెటైర్లు వేసిన ఆయన.. ఇప్పటికే రాష్ట్రంలో రామరాజ్యం కొనసాగుతోందన్నారు.

https://ntvtelugu.com/appsc-new-notifications-for-posts/
Exit mobile version