దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏపీలో వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేస్తోంది. ప్రతి నెలా ఒకటో తేదీన సూర్యోదయానికి ముందే అవ్వా తాతలు, ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు.. ఇలాంటి లక్షలాది మందికి వారి ఇంటికే వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపి, వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది జగనన్న ప్రభుత్వం. వాతావరణ పరిస్థితులు ఎలా వున్నా, కోవిడ్ లాంటి మహమ్మారి వెంటాడుతున్నా వాలంటీర్లు ఆత్మబంధువుల్లా ఒకటో తేదీ ఉదయమే పింఛన్లు అందచేస్తున్నారు.
Read Also: Pakistan: విమాన సిబ్బంది సరైన “లోదుస్తులు” ధరించాలి.. పాకిస్తాన్ ఎయిర్‌లైన్స్ వింత ఆదేశాలు
దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి నెలా అయిదో తేదీలోగానే దాదాపుగా పింఛన్ల పంపిణీ పూర్తి చేస్తోంది. అవ్వా తాతలు, ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు.. వీళ్లు ఎవ్వరూ ఇంటి గడప దాటకుండానే పింఛన్లు అందుకుంటున్నారు. సెప్టెంబర్ నెలకు గానూ 62.53 లక్షల మందికి రూ1,590.50 కోట్లు పంపిణీ చేస్తోంది. గత ఏడేళ్లలో ప్రతి సెప్టెంబర్ నెలలోనూ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి ఖర్చు చేసిన మొత్తం వివరాలివి…
సంవత్సరం పంపిణీ చేసిన మొత్తం
సెప్టెంబర్ 2022 రూ 1,590.50 కోట్లు
సెప్టెంబర్ 2021 రూ.1,397 కోట్లు
సెప్టెంబర్ 2020 రూ1,429 కోట్లు
సెప్టెంబర్ 2019 రూ.1,235 కోట్లు
సెప్టెంబర్ 2018 రూ.477 కోట్లు
సెప్టెంబర్ 2017 రూ.418 కోట్లు
సెప్టెంబర్ 2016 రూ.396 కోట్లు
సెప్టెంబర్ 2015 రూ 405 కోట్లు
Read Also: CM JaganMohanReddy: వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలు ప్రారంభం