NTV Telugu Site icon

YS Avinash Reddy: పులివెందుల ఉప ఎన్నిక కాదు.. మంగళగిరి, పిఠాపురం, కుప్పం సిద్ధమా..?

Ys Avinash Reddy

Ys Avinash Reddy

YS Avinash Reddy: కూటమి సర్కార్‌కు సవాల్‌ విసిరారు కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి.. పులివెందుల ఉప ఎన్నిక కాదు.. సూపర్ సిక్స్ పథకాలు రెఫరండంతో మంగళగిరి, పిఠాపురం, కుప్పం నియోజకవర్గాల్లో ఎన్నికలకు మీరు సిద్ధమా? అని ఛాలెంజ్‌ విసిరారు.. కడప నగరంలోని ఓ దేవాలయ శంకుస్థాపనకు హాజరైన ఆయన.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ పథకాలు పూర్తిగా విఫలం అయ్యాయని ఆరోపించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక పోవడంతో ప్రజల్లో అప్పుడే అసంతృప్తి వస్తోందన్నారు. ప్రతిపక్షాన్ని గుర్తించి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వైఎస్‌ అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు.. ఉన్నది ఒకే ప్రతిపక్షం అని, 11 సీట్లు అన్నది లెక్క కాదన్నారు.. ప్రతిపక్ష హోదా ఇస్తే వైఎస్‌ జగన్.. అసెంబ్లీకి వస్తారని.. వాళ్లకు సినిమా కనబడుతుందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష హోదా ఇస్తే తాము అసెంబ్లీలో సంధించే ప్రశ్నలకు భయపడే ఆ హోదా ఇవ్వలేదన్నారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా కూటమి కుట్ర చేస్తున్నారని కూటమి సర్కార్‌పై మండిపడ్డారు కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి..

Read Also: Harish Rao: టన్నెల్‌లో 8 మంది చిక్కుకొని ఉంటే.. సీఎం ఎన్నికల ప్రచారం చేస్తున్నారు!