Site icon NTV Telugu

YS Viveka Murder Case: వైఎస్‌ వివేకా హత్య కేసులో కొత్త ట్విస్ట్..

Ys Viveka

Ys Viveka

YS Viveka Murder Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు కీలక మలుపు తిరిగింది.. ఈ కేసులో తప్పుడు కేసులు నమోదు చేసిన పోలీసు సిబ్బందిపై తాజాగా చర్యలు ప్రారంభమయ్యాయి. వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత, అల్లుడు రాజశేఖర్, అలాగే సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్ పై తప్పుడు కేసులు నమోదు చేసిన ఇద్దరు పోలీసు అధికారులపై కేసులు నమోదైనట్లు సమాచారం. ఈ ఇద్దరు అధికారులు.. ఏఎస్సై రామకృష్ణారెడ్డి, రిటైర్డ్ ఏఎస్పీ రాజేశ్వర్ రెడ్డి. వీరిపై సుప్రీం కోర్టు తీర్పు అనంతరం కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ తప్పుడు కేసులపై పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్‌ దర్యాప్తు చేపట్టారు. ఎనిమిది నెలల విచారణలో మొత్తం 22 మంది సాక్షులను విచారించి, తప్పుడు కేసులపై క్లోజర్ రిపోర్ట్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. తీర్పు వెలువరించగా.. ఆ తర్వాత ఇద్దరు పోలీసులపై కేసు నమోదు చేశారు పోలీసులు.. ఈ పరిణామంతో వైఎస్‌ వివేకా హత్య కేసు కీలక మలుపు తీసుకున్నట్టు అయ్యింది..

Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Exit mobile version