Site icon NTV Telugu

YS Jagan Pulivendula Tour: నేడు పులివెందులకు వైఎస్ జగన్..

Ys Jagan Statement

Ys Jagan Statement

YS Jagan Pulivendula Tour: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఇవాళ పులివెందలకు వెళ్లనున్నారు. ఆయన మరో రెండు రోజుల పాటు పులివెందులలోనే ఉండనున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో ప్రజాదర్భార్‌ నిర్వహణతో పాటు పార్టీ నేత కుటుంబాన్ని పరామర్శించే కార్యక్రమాలు ఉన్నాయి. వైఎస్‌ జగన్ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు పులివెందుల చేరుకోనున్నారు. అక్కడి భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో ప్రజాదర్భార్‌ నిర్వహించి స్థానిక ప్రజల సమస్యలు, వినతులు స్వీకరించనున్నారు. అనంతరం రాత్రికి అక్కడి నివాసంలో బస చేయనున్నారు.

Read Also: MI vs GT : ముంబై ఈజ్ బ్యాక్.. తిలక్ వర్మ మెరుపు శతకం.. గుజరాత్ టైటాన్స్ ఘోర పరాజయం..

ఇక, రేపు ఉదయం 9 గంటలకు పులివెందుల నుంచి బయలుదేరి లింగాల మండలంలోని ఇప్పట్ల గ్రామానికి వెళ్లనున్నారు. ఇటీవల కన్నుమూసిన స్థానిక వైఎస్సార్సీపీ నేత సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి సానుభూతి తెలియజేయనున్నారు. అనంతరం తిరిగి పులివెందుల క్యాంప్‌ కార్యాలయానికి చేరుకుని మరోసారి ప్రజాదర్భార్‌ నిర్వహించనున్నారు. రాత్రికి అక్కడే బస చేయనున్నారు. ఆ తర్వాత ఈ నెల 23వ తేదీ ఉదయం 8 గంటలకు పులివెందుల నుంచి వైఎస్‌ జగన్ తిరుగు ప్రయాణం కానున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో స్థానికంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

Exit mobile version