Site icon NTV Telugu

YS Jagan: రైతులకు కూలి ఖర్చులు కూడా రావడం లేదు.. ప్రభుత్వమే బ్లాక్‌ మార్కెట్‌ను ప్రోత్సహిస్తోంది..!

Jagan

Jagan

YS Jagan: రైతులకు కూలి ఖర్చులు కూడా రావడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌.. కడప జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. వేంపల్లి మండలం తాళ్లపల్లిలో ఉల్లి పంటను పరిశీలించారు.. అయితే ఉల్లి పంటికి గిట్టుబాటు ధర లభించడంలేదంటూ మాజీ సీఎంకు మొరపెట్టుకున్నారు రైతులు.. దళారులు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో రూ.4 వేల నుంచి రూ.12 వేల వరకు మద్దతు ధర ఇచ్చామని గుర్తుచేశారు.. గ్రేడ్ బాగున్నా రూ. 600 మాత్రమే క్వింటా అమ్ముతున్నారు… రైతులకు కూలి ఖర్చులు కూడా రావడం లేదని వాపోయారు.. రైతులతో ఈ ప్రభుత్వం ఆడుకుంటుందని మండిపడ్డ ఆయన.. ఆర్బీకేల ద్వారా రైతులకు ఎరువులు ఎప్పుడూ అందుబాటులో ఉండేవి.. కానీ, ఈ ప్రభుత్వానికి కమిషన్ రాదని బ్లాక్ మార్కెట్ ను ప్రోత్సహిస్తుందని ఆరోపించారు..

Read Also: YASH : డైరెక్షన్ లో వేలు పెడుతున్న యష్.. టాక్సిక్ షూటింగ్ గందరగోళం

ఇక, ఏ పంట వేసుకున్న రైతుకు గిట్టుబాటు ధర లేదన్నారు వైఎస్‌ జగన్.. అన్నదాత సుఖీభవకు రూ.20,000… రూ. 20,000.. రూ. 40,000 ఇస్తామన్నారు.. ఇంతవరకు ఇవ్వలేదని దుయ్యబట్టారు.. ప్రభుత్వమే రైతులు వద్ద నుంచి ఉల్లి కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు.. కానీ, ప్రభుత్వం బ్లాక్ మార్కెట్ ను ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌.. మరోవైపు, జగన్‌ రాక సందర్భంగా పులివెందుల మండలం నల్లపురెడ్డి పల్లిలో వైసీపీ కార్యకర్తల సంబరాలు చేసుకున్నారు.. జగన్ కు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు గ్రామస్తులు.. మొన్నటి ఉప ఎన్నికల్లో మా ఓటు వేసుకోకుండా అడ్డుకున్నారని ప్ల కార్డులు ప్రదర్శించారు మహిళలు.. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయనిలోని వైఎస్సార్ ఘాట్‌లో నివాళులర్పించి.. కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్‌ జగన్‌ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.. ఆ తర్వాత వైఎస్సార్ ఘాట్ నుంచి పులివెందుల బయల్దేరి వెళ్లారు జగన్‌.. దారి పొడువునా జన నీరాజనం పట్టారు.. తాళ్లపల్లె వద్ద చీనీ, ఉల్లి రైతులతో మాట్లాడిన జగన్.. గత ప్రభుత్వ హయాంలో చీనీ రైతులను ఆదుకున్నామన్న తెలిపారు..

Exit mobile version