Wife Kills Husband: కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసిన ఈ ఘటన సిద్దవటం మండలం లింగంపల్లి గ్రామంలో జరిగింది. అయితే, రాయచోటి ఘాటులో పూర్తిగా పురుగులు పడిన గంగయ్య మృతదేహాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.. లింగంపల్లి పంపు హౌస్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా గాజుల గంగయ్య విధులు నిర్వహిస్తున్నారు. కాగా, ప్రియుడుతో కలిసి ఇంట్లో భార్య సంధ్య ఉండడంతో అది చూసిన గంగయ్య ఆమెను మందలించాడు. దీంతో కోపం పెంచుకున్న భార్య సంధ్య.. తమకు అడ్డుకుగా ఉన్న భర్తను తొలగించుకునేందుకు చంపేయాలని అనుకుంది..
Read Also: Banana At Night Time: రాత్రిపూట అరటిపండ్లు తినడం వల్ల బరువు పెరుగుతారా..? నిజమేనా.?
ఇక, ఆ తర్వాత ప్రియుడు బాలరాజు సహకారంతో భర్త గంగయ్యను భార్య సంధ్య హతమార్చినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పాటు ఆగస్టు 22వ తేదీ నుంచి గాజుల గంగయ్య కనపడలేదు అని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు ప్రియుడు, ప్రియురాలును అదుపులోకి తీసుకున్నారు. అనుమానితులను విచారణ చేయగా.. దర్యాప్తులో పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు అని పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
