CM Chandrababu: జన సముద్రంతో కడప నిండిపోయింది అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మంచి చేస్తే ప్రజలు అండగా ఉంటారని కడప ప్రజలు నిరూపించారు.. ఉదయం నుంచి అన్ని దారులు కడప వైపే చూస్తున్నాయి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జరిగిన మొదటి మహానాడు సూపర్ హిట్ అయింది.. కడప గడపలో మార్పు వస్తుందని ఆనాడే చెప్పాను.. అహంకారంతో విర్రవీగే వారికి కడప జిల్లా ప్రజలు బుద్ధి చెప్పారు.. 2029లో పదికి పది సీట్లు సాధించడానికి మీరు సిద్ధమా.. సార్వత్రిక ఎన్నికల్లో రాయలసీమ ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు.. రాయలసీమలో వైసీపీకి ఏడు సీట్లు వస్తే, కూటమికి అధిక సీట్లు వచ్చాయి.. ఓడిపోయిన పార్టీ ఇప్పటికీ అర్థం చేసుకోలేదు అర్థం చేసుకోదు కూడా.. ప్రజల జీవితాల్లో మార్పు తేవడానికి పుట్టిన పార్టీ టీడీపీ.. ప్రపంచంలోనే ఒక కే స్టడీ వైసీపీ అని చంద్రబాబు మండిపడ్డారు.
Read Also: Shashi Tharoor: ప్రధాని మోడీపై శశి థరూర్ ప్రశంసలు.. కాంగ్రెస్‌లో విభేదాలు తీవ్రం..
ఇక, ఎన్నికల్లో గెలుపులు ఓటములు కొత్త కాదు.. కార్యకర్తలే నా బలం బలగం అని సీఎం చంద్రబాబు అన్నారు. జనసేన, బీజేపీతో కలిసి కూటమి ఏర్పాటు చేసాం.. దాని ప్రభావం అంతా ఇంతా కాదు.. 83 మంది ఎమ్మెల్యేలకు 30 వేల మెజార్టీ వచ్చింది అన్నారు. ముగ్గురికి 90 వేల పైన మెజార్టీ వచ్చింది.. గొడ్డలి పోటు మన రాజకీయం కాదు.. ప్రతి క్షణం కష్టపడి పని చేయడం మన విధానం.. 10 లక్షల కోట్ల అప్పులు, లక్ష ఇరవైల కోట్ల బకాయిలు.. ప్లై మోర్ మైన్స్ కే భయపడని నేను సమస్యలకు భయపడతామా? అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
