TDP Wins in Pulivendula: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన పులివెందులలో టీడీపీ ఘన విజయం సాధించింది.. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో టీడీపీ గెలవడమే కష్టమనే పరిస్థితి నుంచి.. అసలు వైసీపీకి డిపాజిట్ కూడా రాని పరిస్థితి వచ్చింది.. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి తిరుగులేని మెజార్టీతో గెలుపొందారు.. 6,033 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి విజయం సాధించారు.. టీడీపీ అభ్యర్థి లతారెడ్డికి 6,716 ఓట్లు రాగా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 683 ఓట్లు మాత్రమే వచ్చాయి.. దీంతో, టీడీపీ గ్రాండ్ విక్టరీ కొడితే.. వైసీపీకి డిపాజిట్ కూడా దక్కకుండా పోయింది.. ఇక 30 ఏళ్ల తర్వాత పులివెందుల జడ్పీటీసీ.. తెలుగుదేశం పార్టీ వశమైంది..
Read Also: Crime News: మైలపోలు తీస్తుండగా పెళ్లి ఆపిన పోలీసులు.. ఆఖరి నిముషంలో ఏం జరిగిందంటే?
అయితే, 2016లో తప్ప.. మిగిలిన ఐదుసార్లు వైఎస్ ఫ్యామిలీ పెట్టిన అభ్యర్థులే పులివెందుల జడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వచ్చారు.. కానీ, 2016లో నామినేషన్ వేసింది టీడీపీ.. అయితే, పోలింగ్ కు ముందే టీడీపీ అభ్యర్థి.. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.. కానీ, బ్యాలెట్‌లో సైకిల్ గుర్తు ఉండటంతో టీడీపీకి ఏకంగా 2,500 ఓట్లు వచ్చాయి..
