Site icon NTV Telugu

TDP Mahanadu 2025: రెండు గంటల్లో టీడీపీకి రూ.17 కోట్ల విరాళాలు.. ఏం చేస్తారంటే..?

Babu

Babu

TDP Mahanadu 2025: మహానాడు వేదికగా టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు టీడీపీపై విరాళాల వర్షం కురిసింది.. కేవలం రెండు గంటల వ్యవధిలోనే 17 కోట్లకు పైగా విరాళాలు వచ్చినట్టు టీడీపీ ప్రకటించింది.. పార్టీ తరపున సేకరించిన విరాళాలు పార్టీ కోసమే కాకుండా, పేదలు, పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు చేస్తామని వెల్లడించారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

Read Also: BJP MP Laxman: రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడని ఖర్గే కలలు కంటున్నారు..

టీడీపీకి విరాళాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు పిలుపునివ్వగా.. రెండు గంటల వ్యవధిలేనే భారీగా విరాళాలు ఇచ్చారు టీడీపీ నేతలు, కార్యకర్తలు.. పార్టీలో డబ్బున్న నేతలు కార్యకర్తల సంక్షేమానికి విరాళాలు ఇవ్వాలి కోరారు సీఎం చంద్రబాబు.. అయితే, పార్టీ బ్యాంకు ఖాతాను ప్రకటించిన వెంటనే 17 కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయని ప్రకటించారు.. పార్టీకి విరాళాలు ఇచ్చిన దాతలు అందరికీ అభినందనలు.. ఆన్‌లైన్‌లో కూడా పార్టీకి విరాళాలు అందించవచ్చు.. అన్నారు చంద్రబాబు.. మహానాడు ఎప్పుడు నిర్వహించినా హుండీ ఏర్పాటు చేసి.. సేకరించిన విరాళాలు పేదల కోసం ఖర్చు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.. మహానాడు తొలిరోజు ప్రకటన చేయగానే స్పందించి రూ.17 కోట్లకు పైగా విరాళాలు అందించిన టీడీపీ నేతలు, అభిమానులు అందరికీ అభినందనలు తెలియజేశారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కాగా, కడప వేదికగా పసుపు పండుగ మహానాడు అట్టహాసంగా సాగుతోంది.. ఇవాళ ప్రారంభమైన మహానాడు.. మరో రెండు రోజుల పాటు కొనసాగనున్న విషయం విదితమే..

Exit mobile version