NTV Telugu Site icon

POCSO Case: బాలికల ఇంస్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్.. 9వ తరగతి విద్యార్థినిపై పోక్సో కేసు..

Produttur

Produttur

POCSO Case: కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో 9వ తరగతి విద్యార్థిపై ఫోక్సో చట్టం క్రింద కేసు నమోదు అయింది. అయితే, వివరాల్లోకి వెళితే.. సహచర బాలికల ఇంస్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేసి.. ఆ బాలికల వ్యక్తిగత ఫోటోలు, ఫోన్ నెంబర్లను ఇతర విద్యార్థులకు ఇచ్చి వేధించాడు సదరు విద్యార్థి. ఈ విషయం వెలుగులోకి రావడంతో స్కూల్ టీచర్లు నాలుగు రోజుల క్రితం బాలుడిని మదలించి కొట్టారు. ఇక, టీచర్ల తనను వేధిస్తున్నారంటూ బాలుడు తన తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేసిన పోలీస్, విద్యాశాఖ అధికారులు.. పాఠశాలలో జరిగిన ఘటనపై ఎంఈఓ సావిత్రమ్మ, సీఐ మద్దిలేటి విచారణ చేపట్టారు.

Read Also: Nizam : నైజాంలో రాబిన్ హుడ్ కు థియేటర్స్ నయ్‌.. నయ్‌..

అయితే, బాలికల ఇంస్టాగ్రామ్ అకౌంట్స్ హ్యాక్ చేసి తమ ఫోటోలు, నెంబర్లు ఇతరులకు ఇచ్చి వేధిస్తున్నారనే విషయం ఎంఈఓ సావిత్రమ్మ, సీఐ మద్దిలేటి విచారణలో తేలింది. దీంతో విద్యార్థితో పాటు కౌన్సిలర్ మరళీధర్ రెడ్డి, తొమ్మిదవ తరగతి విద్యార్థికి సహకరించిన తల్లిదండ్రుల పైనా కూడా పోక్సో చట్టం కింద కేసు నమోదు అయింది. ఇక, ఈ ఘటనపై ఇప్పటికే విద్యార్థితో పాటు పలువురుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు..