NTV Telugu Site icon

Peddireddy Ramachandra Reddy: పార్టీ కోసం శ్రమించిన వారికే కీలక పదవులు

Peddireddy

Peddireddy

Peddireddy Ramachandra Reddy: పార్టీ కోసం శ్రమించిన వారికే కీలక పదవులు వస్తాయని స్పష్టం చేశారు వైసీపీ రీజనల్‌ కో-ఆర్డినేటర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. కడపలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలోసమావేశమయ్యారు రెండు జిల్లాల ముఖ్య నాయకులు.. పార్టీ బలోపేతంపై చర్చించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం పై దృష్టి సారించాం.. జిల్లా, మండల స్థాయిలో పార్టీ కార్యవర్గాన్ని సిద్ధం చేస్తున్నాం.. నియోజకవర్గ సమన్వయకర్తలతో చర్చించి పార్టీ పోస్టుల్లో నియామకాలు చేస్తున్నాం.. పార్టీలో అవసరమైన మార్పులు చేర్పులు జగన్ దృష్టికి తీసుకుని వెళ్తాం.. పార్టీ కోసం శ్రమించిన వారికే కీలక పదవులు వస్తాయని తెలిపారు.

Read Also: Minister Nara Lokesh: అమెరికా పర్యటనలో మంత్రి నారా లోకేష్‌.. శాన్ ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో భేటీ

ఇక, రాష్ట్రంలో ప్రభుత్వం పరిస్థితి దారుణంగా ఉందన్నారు పెద్దిరెడ్డి.. వైఎస్‌ జగన్ హయంలో ఏపీఈఆర్సీ సమావేశం అనగానే కరెంట్ బిల్లులు పెంపు అని మీడియాలో రాసేవారు.. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో 6 వేల కోట్లు కరెంట్ చార్జీలు పెంచడానికి రంగం సిద్దం చేశారు.. కరెంట్ చార్జీల పెంపు గత ప్రభుత్వంలో జగన్ తప్పుల వలన అని విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.. బోట్లు కొట్టుకుని బ్యారిజీకి ఇబ్బంది ఏర్పడితే… అదీ మా పార్టీపై నింద మోపే ప్రయత్నం చేస్తున్నారు.. మేం రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతులను ఆదుకుంటే… నేడు క్రాప్ ఇన్స్యూరెన్స్ కూడా రైతులే కట్టుకోవాలని నిర్ణయించారని విమర్శించారు.. రైతు ఆత్మహత్యలు రోగం కారణంగా జరిగాయి అని గతంలో టిడిపి ప్రభుత్వం లో నాగం జనార్ధన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా మాట్లాడారు.. అలాంటి వారికి ఏమైనా రైతులు పట్ల బాధ్యత ఉంటుందా? అని ప్రశ్నించారు. మరోవైపు.. చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ ను షర్మిల చదువుతున్నారు.. కేసులో ఉన్న ఆస్తులు బదలాయింపు సాధారణంగా జరగదు.. జగన్ బెయిల్ రద్దు చేయించే కుట్రలకు షర్మిల తెర తీశారు.. చంద్రబాబు పన్నాగం ప్రకారం షర్మిల నడుస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..