Site icon NTV Telugu

Janasena MLA Arava Sridhar New Video: మహిళా ఉద్యోగికి మరోసారి వీడియో కాల్.. వెలుగులోకి జనసేన ఎమ్మెల్యే కొత్త వీడియో..

Janasena Mla Arava Sridhar

Janasena Mla Arava Sridhar

Janasena MLA Arava Sridhar New Video: రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ వ్యవహారం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా నడుస్తోంది.. ఓ మహిళా ఉద్యోగి.. తనను శ్రీధర్‌ లైంగికంగా వేధిస్తున్నాడని.. లైంగిక దాడి చేయడమే కాదు.. ఐదు సార్లు అబార్షన్‌ చేయించాడంటూ సంచలన ఆరోపణలు చేశారు.. అయితే, ఇక, తనతో సదరు ఎమ్మెల్యే చేసిన వాట్సాప్‌ చాట్.. వీడియో కాల్స్‌ కూడా బయట పెట్టింది.. ఇప్పటికే ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.. ఈ ఘటనపై జనసేన పార్టీ ఓ కమిటీ కూడా వేసి విచారణ ప్రారంభించింది..

Read Also: Business Class at Economy Class Prices: ఈ ఐదు సీక్రెట్స్‌ తెలుసుకొండి.. ఎకానమీ క్లాస్ ధరలతోనే విమానంలో బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించండి..!

అయితే, జనసేన పార్టీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఇప్పటికే మహిళా ఉద్యోగిపై లైంగిక ఆరోపణలతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో తాజాగా కొత్త వీడియో బయటకు వచ్చింది. సంబంధిత మహిళా ఉద్యోగికి అరవ శ్రీధర్ మరోసారి వీడియో కాల్ చేసినట్లు సమాచారం. ఈ వీడియో కాల్‌లో తన ప్రేమను గుర్తించాలని కోరుతూ శ్రీధర్ భావోద్వేగానికి లోనైనట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కారులోనే ఉండగా బ్లేడ్‌తో తన చేతిని కోసుకుని, రక్తం కారుతున్న దృశ్యాలను వీడియో కాల్‌లో చూపించినట్లు చెబుతున్నారు.. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సదరు మహిళ బయటపెట్టడంతో వ్యవహారం మరింత తీవ్రతను సంతరించుకుంది. వీడియోలో అరవ శ్రీధర్ ఏడుస్తూ మాట్లాడినట్లు, భావోద్వేగ ఒత్తిడితో ఇలా ప్రవర్తించినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ వ్యవహారంపై జనసేన పార్టీ ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీ దర్యాప్తు చేపట్టిన నేపథ్యంలో, తాజా వీడియో వెలుగులోకి రావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఈ వీడియో విచారణలో కీలక ఆధారంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు, ఈ కేసులో నిజానిజాలు తేల్చేందుకు సమగ్ర విచారణ జరిపి నివేదికను డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు సమర్పించనున్నట్లు పార్టీ వర్గాలు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజా పరిణామాలతో ఈ వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి మరింత పెరిగింది.

Exit mobile version