Janasena MLA Arava Sridhar New Video: మహిళా ఉద్యోగికి మరోసారి వీడియో కాల్.. వెలుగులోకి జనసేన ఎమ్మెల్యే కొత్త వీడియో..
- అరవ శ్రీధర్ వ్యవహారంలో వెలుగులోకి కొత్త వీడియో..
- మహిళా ఉద్యోగికి మరోసారి అరవ శ్రీధర్ వీడియో కాల్..
- చాటింగ్ చేస్తూ కారులోనే చేయి కోసుకున్న అరవ శ్రీధర్..
- తన ప్రేమని గుర్తించాలంటూ వీడియో కాల్ చేసి ఏడ్చిన శ్రీధర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janasena MLA Arava Sridhar New Video: రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా నడుస్తోంది.. ఓ మహిళా ఉద్యోగి.. తనను శ్రీధర్ లైంగికంగా వేధిస్తున్నాడని.. లైంగిక దాడి చేయడమే కాదు.. ఐదు సార్లు అబార్షన్ చేయించాడంటూ సంచలన ఆరోపణలు చేశారు.. అయితే, ఇక, తనతో సదరు ఎమ్మెల్యే చేసిన వాట్సాప్ చాట్.. వీడియో కాల్స్ కూడా బయట పెట్టింది.. ఇప్పటికే ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.. ఈ ఘటనపై జనసేన పార్టీ ఓ కమిటీ కూడా వేసి విచారణ ప్రారంభించింది..
Also Read
అయితే, జనసేన పార్టీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఇప్పటికే మహిళా ఉద్యోగిపై లైంగిక ఆరోపణలతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో తాజాగా కొత్త వీడియో బయటకు వచ్చింది. సంబంధిత మహిళా ఉద్యోగికి అరవ శ్రీధర్ మరోసారి వీడియో కాల్ చేసినట్లు సమాచారం. ఈ వీడియో కాల్‌లో తన ప్రేమను గుర్తించాలని కోరుతూ శ్రీధర్ భావోద్వేగానికి లోనైనట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కారులోనే ఉండగా బ్లేడ్‌తో తన చేతిని కోసుకుని, రక్తం కారుతున్న దృశ్యాలను వీడియో కాల్‌లో చూపించినట్లు చెబుతున్నారు.. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సదరు మహిళ బయటపెట్టడంతో వ్యవహారం మరింత తీవ్రతను సంతరించుకుంది. వీడియోలో అరవ శ్రీధర్ ఏడుస్తూ మాట్లాడినట్లు, భావోద్వేగ ఒత్తిడితో ఇలా ప్రవర్తించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ వ్యవహారంపై జనసేన పార్టీ ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీ దర్యాప్తు చేపట్టిన నేపథ్యంలో, తాజా వీడియో వెలుగులోకి రావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఈ వీడియో విచారణలో కీలక ఆధారంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు, ఈ కేసులో నిజానిజాలు తేల్చేందుకు సమగ్ర విచారణ జరిపి నివేదికను డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు సమర్పించనున్నట్లు పార్టీ వర్గాలు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజా పరిణామాలతో ఈ వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి మరింత పెరిగింది.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!