Minister Savitha: కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో విజయంపై మంత్రి సవిత మాట్లాడుతూ.. గతంలో కడపలో ఏడు ఎమ్మెల్యే సీట్లు గెలిచి తెలుగుదేశం పార్టీ అడ్డా అనిపించుకున్నాం.. ఇప్పుడు పులివెందుల కూడా విజయం సాధించి టీడీపీకి కంచుకోటగా మారబోతుంది అన్నారు. NDA కూటమి సమిష్టి కృషితోనే నేడు పులివెందులలో వైఎస్ఆర్ కుటుంబం అడ్డా అన్న మాటను తుడిపేశాని వెల్లడించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఆలోచనతోనే రాష్ట్రంలో సుపరిపాలలో భాగంగా తొలి అడుగు కార్యక్రమంలో అందరి మనసులు గెలుచుకున్నామని మంత్రి సవిత తెలియజేసింది.
Read Also: Hyderabad: హైదరాబాద్‌లో ఫారెన్ అమ్మాయిలతో వ్యభిచారం.. ఈ వెబ్‌సైట్ల ద్వారా ట్రాప్ చేసి..
ఇక, పులివెందులలో కూడా సుపరిపాలలోని తొలి అడుగు కార్యక్రమం ఎన్డీయే కూటమి విజయానికి దోహద పడింది అని మంత్రి సవిత తెలిపింది. గత 40 సంవత్సరాలుగా పులివెందులలో ప్రజలు ఓటే వేయలేదు, నేడు ధైర్యంగా వచ్చి ఓటు వేశారన్న ఆనందం అక్కడి ఓటర్లలో క్లియర్ గా కనిపిస్తుంది అని చెప్పుకొచ్చింది. రాబోయే రోజుల్లో కూడా పులివెందులలో టీడీపీ విజయం సాధించి.. వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ గల్లంతు అయ్యేలా చేస్తామని హెచ్చరించింది.
