Minister Ramprasad Reddy: స్టేడియాలను ఆధునీకరిస్తాం.. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తాం..
- రాష్ట్రంలోని స్టేడియాలను ఆధునీకరిస్తాం..
- గ్రామీణ పేద క్రీడాకారులను ప్రోత్సహిస్తామన్న మంత్రి రాంప్రసాద్‌రెడ్డి..
- కడప జిల్లా పులివెందులలో పర్యటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Ramprasad Reddy: రాష్ట్రంలోని స్టేడియాలను ఆధునీకరిస్తాం.. గ్రామీణ పేద క్రీడాకారులను ప్రోత్సహిస్తాం అన్నారు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి.. కడప జిల్లా పులివెందులలో పర్యటించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకపోయినా హాకీ ఆంధ్రప్రదేశ్ పోటీ నిర్వహించడం సంతోషించదగ్గ విషయం అన్నారు. ప్రభుత్వంపై ఆధారపడకుండా ఈ పోటీలను నిర్వహిస్తున్న హాకీ ఆంధ్రప్రదేశ్ అధికారులను అభినందించారు.. ఇక, రాష్ట్రంలో ఉన్న స్టేడియాలను ఆధునికరిస్తాం.. మంచి శిక్షణ ఇచ్చేలా తీర్చిదిద్దుతాం అని ప్రకటించారు. గత ప్రభుత్వంలో క్రీడా శాఖ ఒకటి ఉంది అన్నది కూడా ప్రజలు మర్చిపోయారని ఎద్దేవా చేసిన ఆయన.. ఐదేళ్ల చివరి పాలన కాలంలో ఆడుదాం ఆంధ్ర అంటూ ఒక ఈవెంట్ మాత్రమే నిర్వహించారు.. ఆడుదాం ఆంధ్రకు 130 కోట్ల రూపాయలు ఖర్చు చేసి క్రీడాకారుల కడుపు కొట్టారని విమర్శించారు.. క్రీడాకారుల జీవితాన్ని వాళ్ల చేతుల్లోకి తీసుకొని 130 కోట్లు ఖర్చు చేశారు.. క్రీడాకారుల కోసం కాకుండా కేవలం వైసీపీ నాయకుల ప్రచారం కోసం వాడుకున్నారని మండిపడ్డారు.. క్రీడాకారుల సొమ్ము వాడుకున్న వారి నుంచి కక్కిచ్చేందుకు ప్రత్యేకంగా కమిటీ వేస్తున్నామని పేర్కొన్నారు. ఇక, కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులతో పేద గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తాం… పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన గ్రామాల ద్వారా శాప్ ద్వారా క్రీడా పోటీల నిర్వహిస్తామని వెల్లడించారు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి.
Read Also: Nag Ashwin Love: ప్రియాంక దత్ – నాగ్ అశ్విన్ లవ్ స్టోరీ తెలుసా?
Also Read
తాజావార్తలు
-
Keir Starmer: బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్‌కు పదవీ గండం.. యూకేలో అసలేం జరుగుతోంది?
-
NEET Paper Leak: నీట్ పేపర్ లీక్‌లో మాస్టర్ మైండ్ అరెస్ట్.. లీక్ జరిగింది ఇలా..
-
Norovirus vs Hantavirus: నొప్పులు, వాంతులు, అలసట, తలనొప్పి.. కరోనా, నోరో కంటే డేంజర్? దడపుట్టిస్తోన్న హాంటా..!
-
Puttu Recipe : ఆవిరిపై అమృతం.. కేరళ ఫేమస్ బ్రేక్ ఫాస్ట్ పుట్టు ఇలా ఈజీగా చేసుకోండి..!
-
PM Modi: రేపు ఉదయం మోడీ కేబినెట్ భేటీ.. పెట్రో పెంపు తప్పదా?
ట్రెండింగ్
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!