Site icon NTV Telugu

Ram Prasad Reddy: జగన్‌కు మిగిలింది ఇక విలీనమే..! మంత్రి సంచలన వ్యాఖ్యలు..

Ram Prasad Reddy

Ram Prasad Reddy

Ram Prasad Reddy: పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయంపై స్పందించిన మంత్రి రాంప్రసాద్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి, వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి మిగిలింది ఇక విలీనమే అన్నారు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు పోవడమే కాకుండా ఇప్పుడు సొంత మండలం కూడా పోయిందన్న ఆయన.. భారతీయ జనతా పార్టీ దగ్గరకు వెళ్ళలేడు కాబట్టి.. ఆయన మాతృ పార్టీ కాంగ్రెస్ పార్టీలోనే వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీని విలీనం చేస్తాడేమో…? ఆయనకు మిగిలింది అదొక్కటే అని పేర్కొన్నారు..

Read Also: CM Chandrababu: పులివెందులలో టీడీపీ విజయంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

చంద్రబాబు సీఎం అయిన తర్వాత కూటమి ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసే ప్రజలు పులివెందులలో టీడీపీకి విజయం అంధించారని పేర్కొన్నారు రాంప్రసాద్‌ రెడ్డి.. ఒక్క మెతుకు పట్టుకొని చూస్తే.. అన్నం ఒడికిందో లేదో.. ఎలా తెలుస్తుంది.. ఇప్పుడు ప్రజల మనోగతం ఈ ఎన్నికలతో తెలుస్తుందన్నారు.. అయితే, వైఎస్‌ జగన్‌కు ప్రజాస్వామ్యవ్యవస్థపై, ఎన్నికల కమిషన్‌పై నమ్మకం లేకపోవడంతోనే ఇష్టంవచ్చినట్టుగా మాట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు.. సీఎం చంద్రబాబుపై జగన్‌ వ్యాఖ్యలు సరికాదని హితవు చెప్పారు.. ఇప్పుడు ఆయన సొంత నియోజకవర్గంలోని.. సొంత మండలంలోనే జడ్పీటీసీ పోయింది.. ఎంపీలు, ఎమ్మెల్యేలు పోయాయి.. రేపు రానున్న కాలంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అన్ని జగన్‌ చేతుల నుంచి పోతాయంటున్న మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి.. ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..

Exit mobile version