Site icon NTV Telugu

Ravindranath Reddy: పోలీసులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు.. అరెస్టులు దారుణం..

Ravindranath Reddy

Ravindranath Reddy

Ravindranath Reddy: కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి అరెస్ట్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా.. తెల్లవారుజామున వందల మంది పోలీసులతో ఎంపీ అవినాష్‌ రెడ్డిని బలవంతంగా అరెస్ట్ చేయడం హేయమైనా చర్య అన్నారు.. పోలీసులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ఫైర్‌ అయ్యారు. ఓటు వేసేందుకు వెళ్లకుండా ప్రజలను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం.. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని పోలింగ్ జరపడం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇలాంటి ప్రభుత్వాన్ని దేశ చరిత్రలో ఎప్పుడు చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇక, చంద్రబాబు నాయుడుకు రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా..

Read Also: US: మోడీ మంచి నిర్ణయం తీసుకున్నారు.. అమెరికాకు గుణపాఠం నేర్పారన్న పెంటగాన్ మాజీ అధికారి

మరోవైపు, ఎంపీ అరెస్ట్ పై వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.. కడప జిల్లాలో ప్రజాస్వామ్యాన్ని కూటమి నాయకులు అపహాస్యం చేశారు.. ప్రజాస్వామికంగా ఎన్నికలు జరగాలి.. కానీ, పోలీసులను అడ్డం పెట్టుకొని పోలింగ్ జరపడం దారుణం అన్నారు.. ప్రజలు పోలీసుల కాళ్లు పట్టుకుని మా ఓటు మేము వేసుకుంటాం అని ప్రాధేయపడుతున్నారు.. ఇలాంటి ఎన్నికలు దేశ చరిత్రలో ఎప్పుడు చూడలేదు.. చంద్రబాబుకు రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు అని వార్నింగ్ ఇచ్చారు వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి..

Exit mobile version