Site icon NTV Telugu

Kadapa: దైవ సన్నిధిలో పేకాట.. 10 మందిని అరెస్ట్!

Pekata

Pekata

Kadapa: కడప జిల్లా మైదుకూరు మండలం భైరవకోనలోని దైవసన్నిధిలో పేకాట ఆడుతున్న 19 మంది పేకాట రాయుళ్లలో 10 మందిని స్థానికులు గుర్తించి, మైదుకూరు అర్బన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక, పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ తనిఖీల్లో రూ.1.57 లక్షల నగదుతో పాటు పేక ముక్కలను కూడా స్వాధీనం చేసుకున్నారు.

Read Also: Shobhita Dhulipala: నాగచైతన్య కోసం వంటలక్కగా మారిన శోభిత

కాగా, ఈ దాడిలో 8 మంది పేకాటరాళ్లు పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం వారిని ఇంకా అదుపులోకి తీసుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అయితే, పోలీసులు ఇప్పటి వరకు 10 మందిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తుండగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, మరింత లోతుగా దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే, ఆలయం పరిసర ప్రాంతాల్లో భద్రతాపరమైన చర్యలను పెంచి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్ళీ రాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.

Exit mobile version