NTV Telugu Site icon

Adinarayana Reddy: జగన్‌ 2.0 వ్యాఖ్యలపై ఆదినారాయణరెడ్డి కౌంటర్‌ ఎటాక్.. బటన్‌ నొక్కి బటర్‌ మిల్క్‌ ఇచ్చారు..!

Adinarayana Reddy

Adinarayana Reddy

Adinarayana Reddy: మళ్లీ అధికారంలోకి వస్తాం.. జగన్‌ 2.0 వేరుగా ఉంటుంది.. ఈసారి అధికారంలోకి వస్తే 30 ఏళ్లు మనదే పాలన ఉంటుందంటూ వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కౌంటర్‌ ఎటాక్‌ చేశారు.. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి.. వైఎస్‌ జగన్ ప్రతిపక్ష హోదా కోల్పోయారు… 30 ఏళ్ల నా పాలన, 175 /175 ఎమ్మెల్యే, 25/25 ఎంపీలు అనే వారు అంటూ ఎద్దేశా చేశారు.. ఇక, ఢిల్లీ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకోబోతోంది.. ఇక, ఏపీలో వికసిత భారత్ ద్వారా నీకు రాజకీయం లేకుండా చేస్తాం అంటూ హెచ్చరించారు.. నా వెంట్రుక కూడా పికలేరు అనుకుంటున్నారు.. అయితే, అభివృద్ధి ద్వారా నీకు భవిష్యత్ లేకుండా చేస్తాం అన్నారు.. నేను బటన్ నొక్కా.. బటన్ నొక్కా అని చెబుతున్న జగన్‌.. బటన్‌ నొక్కి ప్రజలకు బటర్ మిల్క్ ఇచ్చాడు అంటూ సెటైర్లు వేశారు.

Read Also: CRDA Letter to Election Commission: రాజధాని పనులకు ఎమ్మెల్సీ కోడ్..! ఈసీకి సీఆర్డీఏ లేఖ

ఇక, వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో గుండెపోటు అన్నారు.. వైఎస్‌ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్తే అడ్డుకున్నారు.. వైఎస్‌ జగన్ రెప్పకు దెబ్బతగిలితే అది హత్య, మీ చిన్నాను హత్య చేస్తే కనపడదా..? అంటూ నిలదీశారు ఆదినారాయణరెడ్డి.. జమ్మలమడుగులో మా గ్రామానికి చెందిన వ్యక్తి ఎదో చేస్తే అది నేను చేశాను అట… అసాంఘిక కార్యకలాపాలు చేయించే వ్యక్తిని చెప్పుతో కొడతా.. అంటూ హెచ్చరించారు.. నేనే పోలీసులులను అదేశించా… అసాంఘిక కార్యకలాపాలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరాను అన్నారు.. నా కార్యకర్తలకు ఉద్యోగాలు కోసం పోరాడుతున్నాను.. అంతే తప్ప నేను పరిశ్రమలకు పెట్టే వారికి వ్యతిరేకంగా పని చేయలేదని స్పష్టం చేశారు.. వాల్తేరు డివిజన్ కాదని, విశాఖ కు రైల్వే డివిజన్ ఇచ్చాం.. దవోస్ లో చర్చలు జరిగాయి.. 10 వేల కోట్లతో కడపకు స్టీల్ ప్లాంట్ రాబోతోంది.. జగన్ ను ఏకాకిని చేస్తాం అన్నారు ఆదినారాయణరెడ్డి… జలజీవన్ మిషన్ కు భారీగా నిదులు తెచ్చాం… జగన్ సార్ ది పెద్ద అంగడి, అవినాష్, పెద్దిరెడ్డి, విజయ సాయి రెడ్డి వీళ్లది సూపర్ మార్కెట్, మిగిన వైసీపీ వారిది చిల్లర అంగడి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి..