NTV Telugu Site icon

Rachamallu SivaPrasad Reddy: మందుబాబుల వల్లే ఓటమిపాలయ్యా..! మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Rachamallu

Rachamallu

Rachamallu SivaPrasad Reddy: గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాజయాన్ని ముఠగట్టుకుంది.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఘన విజయాన్ని అందుకుంది.. అయితే, ఇప్పటి వరకు ఆ ఓటమిపై రకరకాల విశ్లేషలు వచ్చాయి.. తాజాగా, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. మందు తాగే తమ్ముళ్ల వల్లే గత ఎన్నికల్లో వైసీపీతో పాటు తాను ఓటమి పాలయ్యాని అని వ్యాఖ్యానించారు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి. మా ప్రభుత్వంలో నాసిరకం మద్యం అమ్ముతున్నారని కూటమి నేతలు ఎన్నికల్లో చేసిన మాటలు నమ్మి మందు బాబులు కూటమికి ఓట్లు వేశారని పేర్కొన్నారు. అయితే, ఎన్నికల తర్వాత మందు బాబులను, మద్యం వ్యాపారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేశారంటూ.. కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. నాడు ప్రభుత్వం అమ్మిన మద్యమే నేడు ప్రైవేటు వ్యాపారులు అమ్ముతున్నారని విమర్శించారు.. నాడు విషం అని చెప్పిన మద్యం, నేడు అమృతంగా మారిందా? అని ప్రశ్నించారు.

Read Also: AlluArjun : ‘పుష్ప-2’ ట్రైలర్‌పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే కామెంట్స్ వైరల్!

ఇక, తక్కువ ధరకే నాణ్యమైన మద్యం ఇస్తామని చెప్పి, నేడు అదే తమ ప్రభుత్వ హయాంలోని మద్యాన్ని అమ్ముతున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి. నేడు మంచినీళ్లు లేకపోయినా మద్యం మాత్రం ఏరులై పారుతోందని అంటూ ఆరోపించారు.. మద్యం ధరలు తగ్గించకుండా ప్రజలను మోసం చేశారు.. అదే విధంగా మద్యం వ్యాపారులను కూడా మోసం చేశారు.. 20 శాతం మార్జిన్ ఇస్తామని హామీ ఇవ్వడంతో అధిక సంఖ్యలో వ్యాపారులు టెండర్లు దాఖలు చేశారు… మద్యం షాపుల లాటరీ ముగిసిన తర్వాత 9:30 శాతాన్ని మాత్రమే ఇస్తామని వ్యాపారులను మోసం చేశారని.. విచ్చలవిడిగా బెల్ట్ షాపులను ఓపెన్ చేయడం వల్ల మద్యం ఏరులై పారుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి.

Show comments