Mandipalli Ramprasad Reddy: అన్నమయ్య జిల్లాలో గాలివీడు మండల పరిషత్ సమావేశ భవనంలో మండల సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. వివిధ శాఖల అధికారులతో శాఖల పని తీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాయచోటి నియోజకవర్గంలో గత వైసీపీ ప్రభుత్వంలో భూ పంపిణీలో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. అనర్హులకు భూములు పంపిణీ చేశారు.. గతంలో జరిగిన భూ పంపిణీపై విచారణ జరిపి అనర్హులు దోచుకున్న భూములను స్వాధీనం చేసుకోవాలంటూ సమీక్ష సమావేశంలోనే రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రికి ఫోన్ చేసి రాంప్రసాద్ రెడ్డి ఫిర్యాదు చేశారు.
Read Also: Paris Olympics: క్వార్టర్ ఫైనల్స్లో గెలిచిన తర్వాత భావోద్వేగానికి గురైన ఇమానే ఖలీఫ్..
కాగా, ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకొని అర్హులైన పేదలందరికీ న్యాయం చేయాలంటూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అధికారులు సమన్వయంతో పని చేసి గాలివీడు మండలాభివృద్ధికి కృషి చేయాలి.. రెవెన్యూ అధికారులు నిజాయితీగా పని చేయాలి అని కోరారు. గృహ నిర్మాణ శాఖలో కూడా అవినీతి, అక్రమాలు జరిగాయి.. త్వరలో వీటిపై కూడా విచారణ జరిపిస్తాం.. అంగన్వాడీ సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించరాదు.. ప్రభుత్వం అందించే పౌష్టికాహారం చిన్నారులకు సక్రమంగా అందేలా చూడాలి.. ఆగస్టు 15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్ లను ప్రారంభిస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.