Site icon NTV Telugu

High Tension in Pulivendula: జడ్పీటీసీ ఉప ఎన్నిక.. పులివెందులలో టెన్షన్‌.. టెన్షన్‌..

High Tension In Pulivendula

High Tension In Pulivendula

High Tension in Pulivendula: కడప జిల్లాలో రెండు జట్పీటీసీ ఉప ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి.. ఇటు పులివెందులతో పాటు అటు ఒంటిమిట్ట జడ్పీటీసీ కోసం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం అయ్యింది.. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది.. అయితే, తెల్లవారుజాము నుంచి టెన్షన్‌ వాతావరణం నెలకొంది.. కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని అరెస్ట్‌ చేశారు పోలీసులు.. అయితే, కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.. పులివెందులలో అవినాష్‌రెడ్డిని అరెస్ట్‌ చేసి కడపకు తరలించారు పోలీసులు. ఇక, వేంపల్లిలో సతీష్‌రెడ్డిని హౌస్‌ అరెస్ట్‌ చేశారు.. టీడీపీ ఎమ్మెల్సీ రామ్‌గోపాల్‌రెడ్డి అరెస్ట్‌కు ప్రయత్నం.. హౌస్‌ అరెస్ట్‌ చేసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు.. ఎన్నికలు జరిగే గ్రామాలకు కూడా నేను వెళ్లనని తెలిపారు రామ్‌గోపాల్‌రెడ్డి..

Read Also: Tiger Shroff : బాఘీ4 టీజర్.. ఆ సినిమాకు చీప్ కాపీ

ఇక, ఒంటిమిట్ట మండలం గొల్లపల్లి పంచాయతీ సర్పంచ్‌ లక్ష్మీనారాయణను హైస్‌ అరెస్ట్ చేశారు పోలీసులు.. అయితే, పులివెందుల ఎన్నికల బరిలో 11 మంది అభ్యర్థులు ఉండగా.. మొత్తం 5 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు.. ఈ ఎన్నికల్లో 10,601 మంది ఓటర్లు.. ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు.. మరోవైపు, ఒంటిమిట్టలో ఎన్నికల బరిలోనూ 11 మంది అభ్యర్థులు ఉండగా.. మొత్తం 17 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు.. ఇక్కడ 24,606 మంది ఓటర్లు ఉన్నారు.. పులివెందుల జడ్పీటీసీ ప ఎన్నికకు 550 మంది పోలీసులు, 4 ప్లటూన్లు, ఏఆర్ పోలీసు బలగాలతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.. అటు ఒంటిమిట్ట ఉప ఎన్నికలకు 650 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.. ఇప్పటివరకు పులివెందులలో 750 మంది పైన బైండోవర్ కేసులు నమోదు కాగా.. ప్రతి పోలింగ్ కేంద్రాల వద్ద డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. ఎక్కడా ఎటువంటి అల్లర్లు జరగకుండా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు.. చట్టాన్ని ఉల్లంఘిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు.. ఇక, బ్యాలెట్ పద్ధతిలో జట్పీటీసీ ఉప ఎన్నికలు జరుగుతుండగా.. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.. అయితే, అటు, వైసీపీ, ఇటు టీడీపీ నేతల అరెస్ట్‌లతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది..

Exit mobile version