Site icon NTV Telugu

MLA Arava Sridhar Controversy: ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ వ్యవహారం.. మరో వీడియో విడుదల చేసిన హర్షవీణ..

Mla Arava Sridhar Incident

Mla Arava Sridhar Incident

MLA Arava Sridhar Controversy: జనసేన నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు సంబంధించిన వివాదంపై బాధితురాలు హర్షవీణ మరోసారి వీడియోను విడుదల చేశారు. హర్షవీణ ఒక సెల్ఫీ వీడియో ద్వారా తన వాదనలను వివరించారు. జనసేన కమిటీ ముందు హాజరుకావాలన్న ఎలాంటి సమాచారం తనకు ఇవ్వలేదని. కమిటీ సభ్యుడు శివశంకర్‌ను ఫోన్‌లో సంప్రదించారని, అలాగే తన వాదనలను, ఆధారాలను పెన్ డ్రైవ్‌లో పంపిన విషయాన్ని ఆ వీడియోలో పేర్కొన్నారు.

Read Also: Perni Nani Quash Petition: పేర్ని నాని క్వాష్‌ పిటిషన్.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

ఈ సందర్భంగా ఫిబ్రవరి 3న జనసేన నేత శివశంకర్ వాట్సాప్ మెసేజ్‌ను బయటపెట్టారు హర్షవీణ.. కమిటీ సభ్యులలో ఎవ్వరూ ఆమెను సంప్రదించలేదని వెల్లడించారు. కమిటీ పిలిస్తే హాజరుకావడానికి సిద్ధంగా ఉన్నందున “కమిటీ ముందు హాజరుకావాలని ఎవరు చెప్పారో స్పష్టంగా వెల్లడించాలి” అని ఆమె డిమాండ్‌ చేశారు.. అలాగే, పవన్ కల్యాణ్‌కు తన వాదనను అందించాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు హర్షవీణ.. చివరగా, తప్పు చేసినవారిని తగిన శిక్ష తీసుకోవాలని హర్షవీణ డిమాండ్ చేశారు.

Exit mobile version