Site icon NTV Telugu

AP Crime: ఏపీలో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం, హత్య..!

Crime

Crime

AP Crime: ఆంధ్రప్రదేశ్‌లో మరో దారుణం వెలుగు చూసింది.. కడప జిల్లాలో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి.. ఆపై హత్య చేశారు కామాంధుడు. చిన్నారిని అత్యాచారం చేసి.. హత్య చేసి.. ఆ తర్వాత కంపచెట్లలో పడేసి వెళ్లిపోయారు దుండగుడు. శుక్రవారం నాడు నాలుగేళ్ల చిన్నారిని రేప్ చేసి.. చంపి ముళ్లపొదల్లో వేసిన దారుణ ఘటన మైలవరంలోని కంబాలదిన్నె గ్రామంలో చోటు చేసుకుంది. జమ్మలమడుగు మండలం మొరగుడి గ్రామానికి చెందిన ఓ వివాహ కార్యక్రమానికి వచ్చిన ఓ యువకుడు ఈ దారుణానికి ఒదిగట్టినట్లు స్థానికులు తెలిపారు. ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని మైలవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే, నిందితుడిని ఎన్ కౌంటర్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు..

Read Also: Airspace ban: పాక్ విమానాలు ఎయిర్‌స్పేస్ బ్యాన్ పొడిగించిన భారత్..

ఇక, చిన్నారిని రేప్ చేసి హత్య చేసిన ఘటనపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ మధ్యకాలంలో కొంతమందిలో మానవత్వం పూర్తిగా నశించిందన్న ఆమె.. ఇటువంటి వారిని ప్రభుత్వం క్షమించదని హెచ్చరించారు.. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేశాం.. ఇటువంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు.. బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలను ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది… ఎవరైనా బాలికలను టచ్ చేయాలంటే వనికేలా యాక్షన్ ఉంటుందన్నారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి..

Exit mobile version