Site icon NTV Telugu

TDP: వైఎస్‌ జగన్‌ అడ్డాలో తెలుగు తమ్ముళ్ల మధ్య తీవ్ర పోటీ..!

Tdp

Tdp

TDP: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అడ్డాలో ఆధిపత్యం కోసం టీడీపీ తమ్ముళ్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది… నిన్న మొన్నటి వరకు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేయాలా? అని తలలు పట్టుకునే టీడీపీకి ఇప్పుడు తీవ్ర పోటీ నెలకొనడంతో అదే తలనొప్పిగా మారింది… సార్వత్రిక ఎన్నికల్లో రెండు దశాబ్దాల తర్వాత కడప గడ్డపై తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడింది… ఆ తరువాత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంతో టీడీపీ జిల్లా అధ్యక్ష పదవికి నేతలు పోటీ పడుతున్నారట.. ప్రస్తుతం టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాసులు రెడ్డికి ఉద్వాసన తప్పదని ఆ పార్టీ నేతలలో గుసగుసలు వినిపిస్తున్నాయట…

Read Also: Four Sisters Get Government Jobs: ఆ తల్లికి వందనం.. నలుగురు కూతుళ్లు ప్రభుత్వ ఉద్యోగులే..

జమ్మలమడుగు టీడీపీ ఇంఛార్జ్‌ భూపేష్ రెడ్డి.. కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి.. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హరి ప్రసాద్ గోవర్ధన్ రెడ్డి.. అమీర్ బాబు తమకంటే తమకు జిల్లా అధ్యక్ష పదవి కావాలంటూ ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టారట… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా ఈరోజు పార్లమెంట్ కమిటీ ఎన్నిక కోసం టీడీపీ అధిష్టానం త్రిమెన్‌ కమిటీని నియమించింది… ఎమ్మెల్సీ బీద రవీంద్ర, ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మనాయుడు ఆశావాహుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు.. ఎన్నడు లేని విధంగా మొదటిసారి జిల్లా అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ నెలకొనడంతో త్రీ మెన్‌ కమిటీ జిల్లా కమిటీని ప్రకటిస్తుందా, లేక అధిష్టానం ప్రకటిస్తుందా అనేది సందిగ్ధంగా మారింది…

Exit mobile version