Site icon NTV Telugu

NICDC: రాయలసీమలో పరిశ్రమలకు కేంద్రం పెద్దపీట.. ఎన్‌ఐసీడీసీకి రూ.872 కోట్లు విడుదల..

Nicdc

Nicdc

NICDC: వెనుకబడిన రాయలసీమలో పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ట్రస్ట్ కు 872.07 కోట్లు నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. కడప జిల్లా చింతకొమ్మ దిన్నె మండలంలోని కొప్పర్తిలో ఉన్న ఇండస్ట్రియల్ పార్క్ ను నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ట్రస్ట్ కు బదలాయించనున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాక్షర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలో నడుస్తున్న కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్కును, ఇకనుంచి నేషనల్ ఇండస్ట్రియల్ క్యారిడార్ క్రిందికి వెళ్ళనున్నది. ప్రస్తుతం ఏపీఐసీసీ చేతిలో ఉన్న 2595.40 ఎకరాల భూములను నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ కు బదిలీ చేయనున్నారు. ఏపీఐసీసీ నుంచి ఎన్ఐసిడిఐటికి భూములు బదలాయింపుకు అయ్యే 65.40 కోట్లు రూపాయల స్టాంప్ డ్యూటీని రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది.

Read Also: Nalgonda: బీఆర్‌ఎస్‌ రైతు మహా ధర్నా.. ముఖ్య అతిథిగా హాజరుకానున్న కేటీఆర్‌

కొప్పర్తి లోని ఏపీఐసీసీ భూములు బదలాయింపు కోసం స్టాంప్ డ్యూటీ కింద 43.60 కోట్లు, రిజిస్ట్రేషన్ రుసుముల కోసం 8.72 కోట్లు, ట్రాన్స్‌ఫర్ డ్యూటీ కింద మరో 13.08 కోట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, రిజిస్ట్రేషన్ ప్రక్రియకు అవసరమైన ఈ మొత్తం 65.40 కోట్ల రూపాయలను చెల్లించాల్సిన అవసరం లేకుండా మినహాయింపు ఇస్తూ, రిజిస్ట్రేషన్ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఆర్‌పీసీ సిసోడియా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. భూముల బద్దలాయింపు కాగానే నేషనల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొప్పర్తిలో మౌలిక వసతులకు శ్రీకారం చుట్టునున్నారు. ప్రధానంగా రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, తాగునీరు వంటి మౌలిక వసతులను 872.07 కోట్లతో చేపట్టనున్నారు…

Exit mobile version