YSRCP vs TDP: కడపలో చెత్త వివాదం కాస్తా.. కడప మేయర్ సురేష్ బాబుతో పాటు పలువురు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు.. మరోవైపు.. తెలుగుదేశం పార్టీ నేతలపై కేసుల నమోదు వరకు వెళ్లింది.. చెత్త వివాదం ఘటనలో ఇరువర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కడప మేయర్ సురేష్ బాబుతో పాటు దాదాపు 15 మంది వైసీపీ నేతల పైన కేసు నమోదు చేసినట్లు చిన్న చౌక్ పోలీసులు తెలిపారు. ఇక, మేయర్ సురేష్ బాబు ఇంటి వద్ద చెత్త వేసిన ఘటనలో టీడీపీకి చెందిన దాదాపు 12 మంది వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు చిన్న చౌక్ పోలీసులు పేర్కొన్నారు.. మేయర్ సురేష్ బాబు అనుమతి లేకుండా పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేయడం.. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం వంటి అంశాలపై ఆయన పై.. ఆయన వర్గీయులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా, ఎమ్మెల్యే మాధవి రెడ్డి మేయర్ సురేష్ బాబు మధ్య తలెత్తిన వివాదం కేసులు వరకు వెళ్లింది.. ఇరు వర్గాలపై కేసు నమోదు చేసినందున నిందితులను త్వరలో అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
Read Also: Kangana Ranaut: కంగనా రనౌత్ సినిమాపై కలకలం.. నిర్మాతలకు నోటీసులు..
