YS Jagan : విజయ్‌కు జగన్ అభినందనలు.. ‘తొలి అడుగులోనే అద్భుతం’ అంటూ ట్వీట్.!

  • విజయ్ విజయంపై జగన్ ప్రశంసల వెల్లువ
  • 'తొలి అడుగులోనే అద్భుతం' అంటూ ట్వీట్
  • బెంగాల్ ఫలితాలపై కూడా జగన్ స్పందన
  • బీజేపీకి అభినందనలు.. మమతాకు సానుభూతి
Vijay Ys Jagan

Vijay Ys Jagan

YS Jagan : తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ, తొలి ఎన్నికల్లోనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన దళపతి విజయ్ (TVK)పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా విజయ్‌కు తన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. విజయ్‌ను ‘ప్రియమైన సోదరుడు’ అని సంబోధిస్తూ జగన్ ఒక భావోద్వేగపూరితమైన ట్వీట్ చేశారు. “నా ప్రియమైన సోదరుడు విజయ్‌కు హృదయపూర్వక అభినందనలు. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగి, అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించడం నిజంగా అద్భుతం” అని కొనియాడారు.

రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజా సేవకు సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న తరుణంలో, విజయ్‌కు కావాల్సిన ఆత్మబలం, విజయం చేకూరాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలో దేవుడు మీకు తోడుగా ఉంటాడంటూ ఆశీస్సులు అందజేశారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపై కూడా వైఎస్ జగన్ స్పందించారు. అక్కడ ఘనవిజయం సాధించిన భారతీయ జనతా పార్టీ (BJP)కి ఆయన తన అభినందనలు తెలియజేశారు. ఇదే సమయంలో, ఎన్నికల్లో ఓటమి పాలైన మమతా బెనర్జీ (దీదీ) పట్ల ఆయన సానుభూతిని వ్యక్తపరిచారు. మమతా బెనర్జీకి తన సానుభూతిని ప్రకటిస్తున్నట్లు జగన్ తన సందేశంలో పేర్కొన్నారు.