Site icon NTV Telugu

YS Jaganmohan Reddy: కుప్పం రెవిన్యూ డివిజన్ పై కామెంట్స్

ఏపీలోని చిత్తూరు జిల్లాలో కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటయిన సంగతి తెలిసిందే. మాజీ సీఎం చంద్రబాబునాయుడు స్వంత నియోజకవర్గం కుప్పం. అక్కడ రెవిన్యే డివిజన్ ఏర్పాటు అనంతరం ఏపీ సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుప్పం స్థానిక ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు రెవిన్యూ డివిజన్ ఏర్పాటుచేశామన్నారు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నా…రెవెన్యూ డివిజన్ కూడా చేసుకోలేక పోయారు.

https://ntvtelugu.com/cm-jagan-launch-new-districts-in-ap/

కుప్పం స్థానిక ఎమ్మెల్యే రెవెన్యూ డివిజన్ కావాలని కోరటంతో కుప్పంను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా 21 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశాం. పాలనా వికేంద్రీకరణే ప్రజలకు మేలు చేస్తుంది. గ్రామం నుంచి రాజధానుల వరకు ఇదే మా విధానం. 15 ఎకరాల విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్ గా జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాం.

ప్రజల విజ్ఞప్తుల మేరకు జిల్లాల్లోనూ కొన్ని మార్పులు చేశాం. 12 నియోజకవర్గాలలో మండలాలను వేరుచేసి రెండు జిల్లాల్లో పెట్టాల్సి వచ్చిందన్నారు జగన్. అంతకుముందు కొత్త జిల్లాలను వర్చువల్ గా ప్రారంభించారు జగన్. ఈ రోజు నుంచే కొత్త కార్యాల‌యాల ద్వారా సేవ‌లందిస్తార‌ని, అంద‌రు ఉద్యోగులంద‌రూ కొత్త కార్యాల‌యాల నుంచే కార్య‌క‌లాపాలు ప్రారంభిస్తార‌ని, జిల్లాల ప్ర‌జ‌ల‌కు, ఉద్యోగుల‌కు, ప్ర‌జాప్ర‌తినిధుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శుభాకాంక్ష‌లు, అభినంద‌న‌లు తెలిపారు.

Exit mobile version