Site icon NTV Telugu

Ys Jagan: రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి!

Jagan

Jagan

Ys Jagan Tweets about Situation in Andhra Pradesh: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. చంద్రబాబు రాజకీయ కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చింది, టీడీపీ యథేచ్ఛ దాడులతో ఆటవిక పరిస్థితులు తలెత్తాయని ఆయన పేర్కొన్నారు. యంత్రాంగం మొత్తం నిర్వీర్యం అయిపోయింది అని ఆరోపించిన ఆయన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపైనా ఉన్మాదంతో దాడులు చేస్తున్నారని అన్నారు. పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు రక్షణే లేకుండా పోయిందని అంటూ వల్లభనేని వంశీ, కొడాలి నాని, దేవినేని అవినాష్ ఇళ్లపై టీటీపీ కార్యకర్తల దాడిని పరోక్షముగా ప్రస్తావించారు.

Jyothi Purvaj: హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి పెళ్లామైపోయి.. ఆసక్తి రేకెత్తిస్తున్న నటి కామెంట్స్

ఉన్నత చదవులకు కేంద్రాలైన యూనివర్శిటీల్లో ఆచార్యులపై దౌర్జన్యాలకు దిగి వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అంటూ ఎస్వీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీకాంత్ రెడ్డి మీద పలువురు నిరసనకు దిగిన అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. గడచిన ఐదేళ్లలో పాలనా సంస్కరణలు, పేదలను ఆదుకునే కార్యక్రమాలతో దేశంలో రాష్ట్రానికి వచ్చిన పేరు ప్రఖ్యాతులన్నింటినీ దెబ్బతీసి కేవలం మూడురోజుల్లోనే హింసాయుత రాష్ట్రంగా మార్చారని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యానికి, పౌరస్వేచ్ఛకు తీవ్ర భంగం వాటిల్లుతోందని, గౌరవ గవర్నర్ జోక్యం చేసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. హింసాయుత ఘటనల్లో బాధితులైన పార్టీ కార్యకర్తలకు, నా అన్నదమ్ములకు, నా అక్కచెల్లెమ్మలకు వైసీపీ తోడుగా నిలుస్తుందని భరోసా ఇస్తున్నానని వైఎస్ జగన్ పేర్కొన్నారు.

Exit mobile version