Site icon NTV Telugu

YS Jagan: యువతకు కూటమి ప్రభుత్వం ఏం చేసింది.. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్

Jagan

Jagan

YS Jagan: స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఎక్స్ (ట్విట్టర్)లో మాజీ సీఎం వైఎస్ జగన్ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. యువతకు కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటూ ఫైర్ అయ్యారు. యువత లక్ష్యంతో, ఏకాగ్రతతో పనిచేస్తే దేశం బలపడుతుందని స్వామి వివేకానంద నమ్మారు.. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఆయన ఇచ్చిన పిలుపును మనం స్మరిస్తున్నాం.. రాష్ట్ర ప్రభుత్వం నిజంగా యువత తమ లక్ష్యాలను సాధించేలా సహకరిస్తుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది.. వాస్తవంగా ఏపీ యువత పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.. ఫీజు రీయింబర్స్‌మెంట్ 8 త్రైమాసికాలుగా పెండింగ్ లో ఉందని వైఎస్ జగన్ పేర్కొన్నారు.

Read Also: Pongal Fight : రాజాసాబ్ vs శంకర్ వరప్రసాద్.. అసలైన విన్నర్ ఎవరు?

ఇక, విద్యా దీవెన కింద ఇవ్వాల్సిన సుమారు రూ. 4,900 కోట్లు ఇంకా చెల్లించలేదని జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. వసతి దీవెన బకాయిలు సుమారు రూ. 2,200 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి.. మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన నెలకు ₹3,000 నిరుద్యోగ భృతి, గత 2 ఏళ్లుగా చెల్లించలేదు.. యువత కోసం ప్రారంభించిన ఆన్‌లైన్ సర్టిఫికేషన్ కోర్సులు నిలిపివేశారు.. మేనిఫెస్టో హామీలను ఉల్లంఘిస్తూ, యువతను మోసం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది.. ఈ చర్యల వల్ల యువత భవిష్యత్తు మాత్రమే కాదు, రాష్ట్ర భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడుతోంది.. కాబట్టి, నేను చంద్రబాబు ప్రభుత్వాన్ని ఒక్కటే కోరుతున్నా.. లేవండి, మేల్కొనండి.. యువత తమ లక్ష్యాలను సాధించేలా అవసరమైన సహకారం అందించండి అని మాజీ సీఎం జగన్ సూచించారు.

Exit mobile version