NTV Telugu Site icon

YS Jagan: నేడు ఉదయం 11 గంటలకు వైఎస్ జగన్ మీడియా సమావేశం..

Jagan

Jagan

YS Jagan: నారా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఈ రోజు (ఫిబ్రవరి 6) మీడియా ముందుకు రాబోతున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో ఆయన ప్రెస్‌ మీట్‌ నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. సూపర్ సిక్స్, మున్సిపల్, కార్పోరేషన్ పదవుల ఎన్నికల్లో కూటమి నేతలు ప్రవర్తిస్తున్న తీరుతో సహా మరిన్నీ అంశాలపై మాట్లాడే ఛాన్స్ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నెలకొన్న పరిస్థితులపై వైఎస్ జగన్ స్పందించనున్నారు.

Read Also: VidaaMuyarchi : అజిత్ విదాముయార్చి.. ట్విట్టర్ రివ్యూ..

అలాగే, వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై ప్రతీకార దాడులకు పాల్పడుతున్న అంశంపై కూడా మాజీ సీఎం జగన్ రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఆందోళనలో ఉన్న పార్టీ శ్రేణులకు ఆయన ధైర్యం చెప్పనున్నారు. ఇప్పటికే, నిన్న విజయవాడ కార్పొరేటర్లతో జరిగిన సమావేశంలో మాట్లాడిన జగన్.. కష్టాలు ఎల్లకాలం ఉండవని.. ఎవ్వరికి ఏ ఇబ్బందులు వచ్చినా తన జీవితాన్ని గుర్తుతెచ్చుకోవాలని భరోసా ఇచ్చారు. అలాగే, ఎన్డీయే కూటమి సర్కార్ పూర్తిగా విఫలమైందని, ఈసారి జగనన్న 2.O వేరుగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ఈరోజు నిర్వహించబోతయే ప్రెస్‌మీట్‌పై మరింత ఆసక్తి నెలకొంది.