చిరువ్యాపారుల కోసం జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కోసం రూ.370 కోట్ల రూపాయలను రిలీజ్ చేశారు. 3.7 లక్షల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. చిరు వ్యాపారులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని, గత్యంతరం లేక వ్యాపారులు అధిక వడ్డీకి రుణాలు తీసుకుంటున్నారనీ, వాటిని చెల్లించలేక పేదలు అష్టకష్టాలు పడుతున్నారని, వ్యవస్థలను పేదలకు ఉపయోగపడేలా తీసుకురావాలని, లేకపోతే ప్రభుత్వాలు విఫలం అయినట్టే అని జగన్ పేర్కొన్నారు.