NTV Telugu Site icon

సీఎం జ‌గ‌న్‌కు కొత్త పేరు పెట్టిన నారా లోకేష్.. ఇక నుంచి ఆయ‌న‌…!

Lokesh Jagan

ఏపీలో అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్ష టీడీపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతూనే ఉంది.. తాజాగా, సీఎం వైఎస్ జ‌గ‌న్‌కు కొత్త పేరు పెట్టారు తెలుగుదేశం పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్.. తూర్పుగోదావరి జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌.. జ‌గన్ రెడ్డి పేరు ఇక నుంచి జాంబీ రెడ్డి అంటూ వ్యాఖ్యానించారు.. సీఎం కుర్చీలో ఉన్నవారికి సంక్షేమం, అభివృద్ధి చేస్తే ఆనందం వస్తుంది.. కానీ, జాంబీ రెడ్డి.. టిడిపి నేతలు, కార్యకర్తల అరెస్టులతో ఆనందిస్తున్నార‌ని మండిప‌డ్డారు.. మాపార్టీ వారిపై కేసులు, అరెస్టులు టీవీల్లో చూసి తాడేపల్లి ఇంట్లో జాంబీ రెడ్డి తొడ కొట్టుకుంటార‌నంటూ సెటైర్లు వేసిన లోకేష్.. అనపర్తిలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి యాక్టర్ గా మారార‌ని.. అనపర్తిలో స్థానిక ఎమ్మెల్యే అవినీతిని ఆధారాలతో సహా బయటపెట్టారనే రామకృష్ణారెడ్డిని అక్రమ అరెస్టు చేశార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి మండలం, రామవరం గ్రామంలో కేసులు, అరెస్టులకు గురైన టీడీపీ నాయకుడు..మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించిన నారా లోకేష్… ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడారు.. చ‌ట్టానికి వ్యతిరేకంగా మాపై కేసులు పెడుతున్న అందరి పేర్లు సిద్ధంగా ఉన్నాయి, వారు మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు.. నా పై కేసులు పెట్టండి బరిస్తా… నన్ను అరెస్ట్ చేయండి బాధ‌ప‌డ‌ను.. మా పార్టీ కార్యకర్తల జోలికి వస్తే వడ్డీతో సహా ఇచ్చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు నారా లోకేష్.