Site icon NTV Telugu

YS Jagan: రేపు పార్లమెంటరీ పార్టీ నేతలతో వైఎస్ జగన్ భేటీ..

Jagan

Jagan

YS Jagan: రేపు ఉదయం 10.30 గంటలకు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకులతో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ సమావేశం కానున్నారు. అలాగే, ఈ మీటింగ్ కి రీజనల్‌ కో- ఆర్డినేటర్లు కూడా హాజరు కానున్నారు. అయితే, పార్టీ నేతలకు, సభ్యులకు జగన్ రాబోయే రోజుల్లో పార్టీ అనుసరించే అంశాలతో పాటు కూటమి ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉండాలని మాజీ సీఎం వైఎస్ జగన్ దిశానిర్థేశం చేయనున్నారు.

Exit mobile version