YS Jagan: మొంథా తుఫాను నేపథ్యంలో ఇవాళ (అక్టోబర్ 30న) తాడేపల్లిలోని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ రీజినల్ కో-ఆర్డీనేటర్లు, జిల్లా అధ్యక్షులతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. తుఫాను తర్వాత జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులు, పంట నష్టం లాంటి వివరాలను పార్టీ నేతలను అడిగి తెలుసుకోనున్నారు. అలాగే, బాధితులకు కూటమి ప్రభుత్వం నుంచి తగిన సాయం అందేలా ఒత్తిడి తీసుకు రావడంపై నాయకులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ఇక, మొన్న తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అండగా నిలవాలన్న జగన్ పిలుపు మేరకు క్షేత్రస్థాయిలో చురుగ్గా పని చేసిన పార్టీ నేతలు, కేడర్.
Read Also: Murder: దారుణం.. అర్థరాత్రి యువకుడిపై కత్తులతో దాడి.. హత్య
అయితే, తుఫాను బాధితులకు శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకూ ఉన్న వైసీపీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ కార్యకర్తలు అండగా నిలిచారు. ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించడ, వారికి ఆహారం అందించడంతో పాటు తుఫాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టపోయిన బాధితులకు భరోసా ఇవ్వడంతో పాటు వివరాలు సేకరించారు. తుఫాను నష్టంపై పూర్తి వివరాలను వీడియో కాన్ఫరెన్స్ లో వైఎస్ జగన్ కు పార్టీ నేతలు వివరించనున్నారు.
