NTV Telugu Site icon

YS Jagan: ఏపీలో ముఠాల పాలన కనిపిస్తుంది..

Jagan

Jagan

YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వ స్థానంలో ముఠాల పాలన కనిపిస్తోంది అని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన ఈ రెండు నెలల కాలంలో ఏపీ అంటేనే రాజకీయ హింసకు మారు పేరుగా మారిపోయింది అన్నారు. పరిస్థితిలో ఏమాత్రం మార్పు రావడం లేదు.. ప్రభుత్వంలో పెద్దల ప్రోత్సాహంతో జరిగే ఘటనలు, అధికారంలో తమ పార్టీ ఉందనే ధీమాతో చేస్తున్న దాడులు, రాజకీయ ప్రేరేపిత దుశ్చర్యలు రాష్ట్రంలో ప్రతి రోజూ జరుగుతూనే ఉన్నాయని వైఎస్ జగన్ అన్నారు.

Read Also: Komatireddy Venkat Reddy: ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనుల పరిశీలన.. కొత్త టెండర్ల ఏర్పాటుకు ఆదేశం

ఇక, నంద్యాల జిల్లాలో నిన్న ( శనివారం) రాత్రి జరిగిన హత్య, ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో జరిగిన దాడి ఘటన వీటికి నిదర్శనాలే అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిలబెట్టుకోలేకపోవడంతో పాటు ఎవరూ ప్రశ్నించకూడదని, రోడ్డుపైకి రాకూడదని ప్రజలను, వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేయడానికి ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారు అని మండిపడ్డారు. ఈ దారుణాల బాధితులకు అండగా ఉంటూ.. పోరాటాన్ని కొనసాగిస్తామని మాజీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు.

Show comments