నేడు రాత్రి ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీకి బయలదేరనున్నారు. ఏపీ సీఎం జగన్ ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి సాయంత్రం 7 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి దిల్లీకి బయలుదేరనున్నారు. ఇవాళ ఆదివారం రాత్రి 9.15 గంటలకు దిల్లీ చేరుకుని, జన్‌పథ్-1లో రాత్రి బస చేయనున్నారు. ఉదయం పది గంటలకు ప్రధాని నరేంద్రమోదీతో జగన్ సమావేశం కానున్నారు. రాష్ట్ర సమస్యలపై ఆయన చర్చించనున్నారు. దాంతోపాటుగా.. పోలవరం ప్రాజెక్టు నిధులతో పాటు ఏపీకి రావాల్సిన వివిధ ప్రాజెక్టులపై జగన్ వినతి పత్రాన్ని సమర్పించనున్నారు. రేపు రాత్రి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తో జగన్మోహన్ రెడ్డి భేటీ కానున్నారు.
షెడ్యూల్ ఇదే..
ఈ రోజు రాత్రి 10.15 గంటలకు ఢిల్లీ చేరుకోనున్న ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి.
రేపు ఉదయం 10.15 గంటలకు ప్రధాని నరేంద్ర మోడి తో ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సమావేశం.
రేపు రాత్రి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తో భేటీ కానున్న ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ను మర్యాదపూర్వకంగా కలవనున్న ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి.
కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ లతో కూడా ఏపీ సీ.ఎమ్ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం.
Somu Veerraju: ఏపీలో త్వరలో సినిమా సీన్లను మించిన స్థాయిలో పరిణామాలు