AP Young Man Died in America: అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువకుడు కన్నుమూశాడు.. ఉద్యోగంలో చేరిన మూడు రోజులకే రవికుమార్ అనే యువకుడు కన్నుమూయడంతో.. ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది… ఈ నెల 17న అమెరికా వెళ్లిన రవికుమార్.. మూడు రోజుల క్రితం సీమన్‌గా ఉద్యోగంలో చేరాడు.. అయితే, కంటెయినర్ పైనుంచి జారిపడి ప్రాణాలు విడిచాడు.. రవికుమార్ స్వస్థలం.. సంతబొమ్మాలి మండలం ఎం.సున్నాపల్లి.. రవికుమార్ మరణవార్తతో.. ఎం.సున్నాపల్లిలో విషాదచాయలు అలుముకున్నాయి.. అయితే, రవికుమార్ ఈ నెల 17న మరో 10 మందితో అమెరికా వెళ్లారు. అక్కడ మూడు రోజుల క్రితం సీమన్‌గా ఉద్యోగంలో చేరిన తర్వాత జరిగిన ప్రమాదంలో అతడు ప్రాణాలు కోల్పోయాడు.. బుధవారం సాయంత్రం రవికుమార్ విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది..
Read Also: Anchor Vishnu Priya: బుల్లితెర యాంకర్ ఇంట విషాదం.. రెస్ట్ ఇన్ పీస్ అమ్మా అంటూ..
అయితే, రవికుమార్ మృతిపై బాధిత కుటుంబ సభ్యులకు గురువారం కంపెనీ ప్రతినిధులు సమాచారం చేరవేశారు.. రవికుమార్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. మృత దేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కాగా, విద్యా, ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లిన విద్యార్థులు, యువకులు వరుసగా ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు.. నాలుగు రోజుల క్రితం అమెరికాలో కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన జాహ్వవి అనే విద్యార్థిని మృతిచెందిన విషయం విదితమే.. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఆమె రోడ్డుప్రమాదంలో ప్రాణాలు విడిచింది.
