Konaseema District: అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం మండలంలో విషాదం చోటు చేసుకుంది. క్రిస్మస్ సమీపిస్తున్న సందర్భంగా గుడిమెల్లంకలో స్థానిక ఓబెరు చర్చిలో అప్పుడే సంబరాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా 70 కిలోల స్టార్ లైట్‌ను చర్చి పిల్లర్‌కు కడుతుండగా సిమెంట్ పిల్లర్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో చెలిమి శివకృష్ణ (27) అనే యువకుడు తీవ్రగాయాల పాలయ్యాడు. అయితే స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు.
Read Also: Andhra Pradesh: ప్రత్తిపాడులో రెండు లారీలు ఢీ.. ముగ్గురు సజీవదహనం
ఈ నెలాఖరులో కువైట్ వెళ్లేందుకు మృతుడు శివ అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. క్రిస్మస్ ముగిసిన తర్వాత కువైట్ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కానీ విధి అడ్డం తిరగడంతో అనంత లోకాలకు వెళ్లిపోయాడు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా క్రిస్మస్ స్టార్ కడుతుండగా ఒక్కసారిగా పిల్లర్ యువకుడు శివకృష్ణ ఛాతిపై బలంగా పడడంతో కొనఊపిరితో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. అతడి మరణంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.