Site icon NTV Telugu

Crime News: ఏపీలో మరో దారుణం.. యువతిపై చాకుతో ప్రేమోన్మాది దాడి

Knife Attack

Knife Attack

Crime News: ఏపీలో మరో దారుణం చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలు గ్రామంలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. గురువారం అర్ధరాత్రి మాణిక్యం అనే యువతిపై రాజులపాటి కల్యాణ్ అనే యువకుడు చాకుతో దాడి చేశాడు. అడ్డువచ్చిన మాణిక్యం చెల్లెలు వెంకట లక్ష్మీని, తల్లి భాగ్యలక్ష్మీపైనా సదరు యువకుడు చాకుతో దాడి చేశాడు. దీంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకుని క్షతగాత్రులను స్థానికులు తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Read Also: Kamareddy Bandh: నేడు కామారెడ్డి బంద్‌.. రైతుల ఆందోళనకు బీజేపీ, కాంగ్రెస్ మద్దతు

అనంతరం మెరుగైన వైద్యం కోసం గాయాలపాలైన ముగ్గురిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని తెలుస్తోంది. గత రెండు నెలలుగా ప్రేమిస్తున్నానంటూ మాణిక్యం వెంట పడుతున్న కళ్యాణ్‌ను ఆమె తండ్రి ఏడుకొండలు పలుమార్లు హెచ్చరించాడు. దీంతో గతంలో రెండు సార్లు ఏడుకొండలు పశువుల మేతకు కళ్యాణ్ నిప్పు పెట్టాడు. అంతటితో ఊరుకోకుండా తనను ప్రేమించడంలేదనే అక్కసుతో మాణిక్యంపై దాడికి పాల్పడ్డాడ. కాగా ఈ ఘటనపై తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version