NTV Telugu Site icon

Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్..!

Ap

Ap

Rain Alert: ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. వాతావరణ ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు పడనున్నాయని తెలిపింది. వచ్చే 24 గంటల్లో కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. సముద్ర తీరం వెంబడి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ సూచించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలను జారీ చేసింది.

Read Also: Rana Daggubati : నివేతా థామస్, ప్రియదర్శిల మధ్య ఎం జరిగిందో తెలుసా..?

కాగా, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, కర్నూలు, విజయనగరం, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పుకొచ్చారు. తీర ప్రాంతంలో అలల వేగం పెరుగుతుందన్నారు. అంతర్వేది నుంచి పెరుమల్లపురం, కృష్ణా తీరంలో నాచుగుంట నుంచి పెద్ద గొల్లపాలెం వరకు అతివేగంగా అలలు వస్తాయని వెదర్ డిపార్ట్మెంట్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే, నెల్లూరు తీరంలో కోరమాండల్ నుంచి వట్టూరుపాలెం వరకు పశ్చిమ గోదావరి తీర ప్రాంతం అంతటా అతివేగంతో అలలు వస్తాయని పేర్కొంది. ఈ క్రమంలో మత్స్యకారులు అలర్ట్ గా ఉండాలని, వేటకు వెళ్లొద్దని ఐఎండీ అధికారులు సూచనలు చేశారు.