NTV Telugu Site icon

కమలాపురంను కైవసం చేసుకున్న వైసీపీ..

ఏపీలోని 12 మున్సిపాలిటీలు, నగరపంచాయతీల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కడప జిల్లాలోని కమలాపురం నగర పంచాయతీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసింది. కమలాపురం మునిసిపాలిటీలోని 20 వార్డుల్లో 15 వైసీపీ, 5 వార్డుల్లో టీడీపీ గెలుపొందింది. 01, 06, 12, 13, 19 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు.

Also Read:బద్దలైన చంద్రబాబు కంచుకోట.. కుప్పంలో వైసీపీ దూకుడు..

2, 3, 4, 5, 7, 8, 9, 10, 11, 14,15, 16, 17,18, 20 వార్డుల్లో వైసీపీ అభ్యర్థుల విజయం కేతనం ఎగరవేశారు. కమలాపురం మునిసిపల్ తొలి ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడం విశేషం. దీంతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. 3 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు స్వల్ప మెజారిటీతో గెలవడంతో రీ కౌంటింగ్ నిర్వహించారు. ఉత్కంఠగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాగింది.
కొన్ని వార్డుల్లో టీడీపీ గట్టి పోటీ ఇచ్చిన్పటికీ కమలాపురంలో వైసీపీ జెండా ఎగరవేసింది.