బద్దలైన చంద్రబాబు కంచుకోట.. కుప్పంలో వైసీపీ దూకుడు..

ఏపీ ప్రతిపక్ష పార్టీ అధినేత చంద్రబాబు కంచుకోట కుప్పంలో వైసీపీ విజయకేతనం ఎగురవేస్తోంది. కుప్పం మున్సిపాలిటీలో 25 వార్డులకు ఎన్నికలు జరుగగా నేడు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ 14 స్థానాల్లో గెలుపొందింది. టీడీపీ అభ్యర్థులు 2 స్థానాల్లో విజయం సాధించారు.

అయితే ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిననాటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలో వైసీపీ జెండా ఎగరవేయాలని అధికార పార్టీ నేతలు నిర్ణయించుకున్నారు. అనుకున్న విధంగానే వైసీపీ అభ్యర్థులు విజయం సాధించడంతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. మిగిలిన స్థానాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

Related Articles

Latest Articles